హైదరాబాద్ : రేపటి నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు.. ఫేస్‌బుక్‌, యూట్యూట్‌లో లాటరీ లైవ్ స్ట్రీమింగ్

హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను లాటరీ పద్ధతి కింద లబ్ధిదారులకు కేటాయించనున్నారు హెచ్ఎండీఏ అధికారులు. వీటిలో డబుల్ బెడ్ రూం, త్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లు వున్నాయి. 
 

rajeev swagruha flats will be handed over to buyer in hyderabad

హైదరాబాద్ బండ్లగూడ (bandlaguda), పోచారంలోని (pocharam) రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల (rajeev swagruha flats ) అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఈ ఫ్లాట్ల విక్రయానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) (hmda) నోటిఫికేషన్‌ ఇవ్వగా సోమవారం నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయించనున్నారు. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు రాగా.. పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి.   

Also Read:ఉప్పల్ భగాయత్ భూముల వేలం :హెచ్ఎండీఏకు కాసులు పంట .. ఎంత ఆదాయమో తెలుసా..?

వీటిలో అత్యధికంగా బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. లాటరీ ప్రక్రియ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో లైవ్‌స్ట్రీమింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.  27న పోచారం, 28న బండ్లగూడ, 29న బండ్లగూడ త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం డ్రా నిర్వహించనున్నారు. పారదర్శకతను నిర్ధారించడానికి పూర్తి ప్రక్రియను హెచ్‌ఎండీఏ అధికారులు రికార్డ్‌ చేయనున్నారు. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్‌ మాత్రమే కేటాయిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఆధార్‌ సంఖ్యను ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంటారు. లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios