హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల ఓ పబ్ లో అశ్లీల నృత్యాలు చేయించిన నిర్వాహకుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఓ విత్తన సంస్థ కోసం రేవ్ పార్టీ నిర్వహించడాన్ని పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. 

పబ్ యజమానులతో పాటు రేవ్ పార్టీ నిర్వాహకులను పట్టుకోవడానికి జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఎఫ్ఏఐ (టాట్) పబ్బులో ఈ నెల 12వ తేదీన రేవ్ పార్టీ నిర్వహించారు. 

Also Read: పబ్ లో అశ్లీల నృత్యాలు... 23మంది అమ్మాయిలు అరెస్ట్

వివిధ రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి, అశ్లీల నృత్యాలు చేయించారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఆ తర్వాత వెంటనే పబ్ యజమానులు సంతోష్ రెడ్డి, భరత్ లతో పాటు రేవ్ పార్టీ నిర్వాహకులు ప్రసాద్, శ్రీనివాస నాయుడు పారిపోయారు.

Also Read: జూబ్లీహిల్స్ రేవ్ పార్టీలో ట్విస్ట్: అశ్లీల నృత్యాలు, వ్యభిచారం, సూత్రధారి ఇతనే

ఆ తర్వాత కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని 21 మంది యువతులను అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేసారు. రేవ్ పార్టీ నిర్వహించిన విత్తన సంస్థను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో పబ్ యజమానులు, రేవ్ పార్టీ నిర్వాహకులు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశఆరు.