హైదరాబాద్ నగరంలో అశ్లీల నృత్యాల కలకలం రేగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని  ఓ పబ్ లో అశ్లీల నృత్యాలు సాగించారు. కాగా... సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి దాదాపు 23మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదివారం సాయంత్రం పలువురు యువతీ యువకులు పబ్ లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో భాగంగా కొందరు యువతులను పబ్ కి రప్పించారు. వాళ్లతో అశ్లీల నృత్యాలు చేయించారు. అయితే.... ఈ విషయం బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో... ఏసీపీ ఆదేశాల మేరకు పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు.

Also Read మితిమీరిన మందుబాబుల ఆగడాలు: యువతిని బైకులతో అడ్డగించి

అక్కడ అరకొర దుస్తులు వేసుకొని నృత్యాలు చేస్తున్న 23మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు పోలీసులు చెప్పారు. అయితే.. వాళ్లు మాత్రం తాము కేవలం పార్టీ చేసుకోవడానికి వచ్చామంటూ చెప్పడం గమనార్హం. వీడియోలు, ఫోటోలు తీసున్న మీడియా ప్రతినిధులపై కూడా మండిపడ్డారు.

కాగా.. సీడ్స్ కంపెనీకి చెందిన ఓ వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని వారు చెప్పడం గమనార్హం.