హైదరాబాద్: హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని రేవ్ పార్టీకి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓ పబ్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

పట్టుబడిన యువతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందినవారుగా తెలుస్తోంది. సినిమా అవకాశాల కోసం హైదరాబాదు వచ్చిన యువతులను ఈ రొంపిలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రసాద్ అనే వ్యక్తి దీని ప్రధాన సూత్రధారి అని పోలీసులు కనిపెట్టారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Also Read: పబ్ లో అశ్లీల నృత్యాలు... 23మంది అమ్మాయిలు అరెస్ట్

యువతులతో అశ్లీల నృత్యాలు మాత్రమే కూడా వ్యభిచారం కూడా చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫార్మా కంపెనీ అమ్మకాలు పెంచుకునేందుకు ఆ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్లు సేల్స్ ఉద్యోగుల కోసం దాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. 

పబ్ లో అరకొర దుస్తులు ధరించిన యువతులు నృత్యాలు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పబ్ పై దాడి చేశారు. 23 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.