రాజకీయ నాయకులు అన్నాకా.. అందులో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది అభిమానులున్నారు.

ఇక అసలు విషయానికొస్తే బైక్‌పై వెళ్తున్నప్పుడో, కార్లపై వెళ్తున్నప్పుడో ట్రాఫిక్ పోలీసులు ఆపితే.. వారి నుంచి తప్పించుకోవడానికి మాకు వాళ్లు తెలుసు.. వీళ్లు తెలుసంటూ హంగామా చేయడం ఎన్నోసార్లు చూశాం.

ఈ క్రమంలో ఓ వ్యక్తి ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు వాడుకున్నాడు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి  చెందిన ముప్పిడి హరి రాకేశ్ అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బిటెక్ చదువుతున్నాడు.

ఇతని కారుకి ముందు వెనుక ఉన్న నెంబర్ ప్లేట్లపై ఏపీ సీఎం జగన్ అని రాసివున్న ప్లేటును వినియోగిస్తున్నాడు. మంగళవారం ఆ కారును గుర్తించిన జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో ట్రాఫిక్ చలానాలు, టోల్ ఫ్రీ చెకింగ్‌ల నుంచి తప్పించుకోవడానికే తాను జగన్ పేరు రాసుకున్నట్లు రాకేశ్ తెలిపాడు.

దీనిపై జీడిమెట్ల సీఐ మాట్లాడుతూ.. సొంత వాహనాలపై ముఖ్యమంత్రి పేరు రాసుకుని పోలీసులను తప్పుదోవ పట్టించడం నేరమని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రికార్డుల్లో రాకేశ్ కారు ఏపీ 10 బీడీ 7299గా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, కోటవారి వీధికి చెందిన యేసురెడ్డి పేరిట రిజిస్టరయ్యిందని ఆయన వెల్లడించారు. 

Also Read: ఈ వింత చూశారా... జంతువులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయి

ప్రస్తుతం దేశంలో ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవలే... నూతన మోటార్ వాహన చట్టం 2019 ను అమలు చేయగా... దాని ప్రకారం.. ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తున్నవారికి భారీ జరిమానాలు పడుతున్నాయి. భారీ జరిమానాలు విధిస్తున్నప్పటికీ... వాటిని అతిక్రమించి అడ్డంగా బుక్కౌతున్నవారు చాలా మందే ఉన్నారు.

గంటల తరబడి సినిమా టికెట్ల కోసం ఎదురుచూసేవాళ్లు కూడా ట్రాఫిక్ సిగల్స్ దగ్గర మాత్రం కాసేపు ఆగలేరు. రెడ్ సిగ్నల్ పడినా కూడా వాహనాన్ని  పోనిస్తుంటారు. అలాంటివాళ్లంతా ఈ నోరులేని ఆవును చూసి నేర్చుకోవాల్సిందే.

రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలతో పాటు ఆవు కూడా ఆగిపోయి వాహనదారులను ఆశ్చర్యపరిచింది. తప్పు చేసిన మనిషిని పట్టుకుని జంతువులతో పోల్చి తిడుతుంటారు. ఈ ఆవును ఇక నుంచి జంతువులతో పోల్చి తిట్టడం మానేస్తారు. ఎందుకంటే.. మనకంటే అవే చాలా బెటర్ అని ఈ వీడియో స్పష్టంగా చెబుతోంది.

ఇంతకీ ఈ ఆవును మనకు పరిచయం చేసింది బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింటా. రెడ్ సిగ్నల్ పడగానే సరిగ్గా జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆవు ఆగిపోయింది. సిగ్నల్ పడేంత వరకు వేచి చూసి వెళ్లింది. ఇదంతా వీడియో తీసి తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది ప్రీతి.

Also Read:ట్రాఫిక్ కి చెక్ పెట్టండిలా...(వీడియో)

‘జనం సంగతి పక్కన పెడితే.. చివరికి జంతువులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయి. నమ్మడం లేదా.. అయితే ఈ వీడియో చూడండి’ అని ప్రీతి పేర్కొంది. దీంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది ఆ ఆవు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. రాను రాను మనుషులే జంతువుల కన్నా హీనంగా తయరవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.