Asianet News TeluguAsianet News Telugu

ఈ వింత చూశారా... జంతువులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయి

తప్పు చేసిన మనిషిని పట్టుకుని జంతువులతో పోల్చి తిడుతుంటారు. ఈ ఆవును ఇక నుంచి జంతువులతో పోల్చి తిట్టడం మానేస్తారు. ఎందుకంటే.. మనకంటే అవే చాలా బెటర్ అని ఈ వీడియో స్పష్టంగా చెబుతోంది.

Preity Zinta Shares 'Funday Sunday' Video Of Cow Obeying Traffic Rules
Author
Hyderabad, First Published Oct 7, 2019, 7:56 AM IST

ప్రస్తుతం దేశంలో ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవలే... నూతన మోటార్ వాహన చట్టం 2019 ను అమలు చేయగా... దాని ప్రకారం.. ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తున్నవారికి భారీ జరిమానాలు పడుతున్నాయి. భారీ జరిమానాలు విధిస్తున్నప్పటికీ... వాటిని అతిక్రమించి అడ్డంగా బుక్కౌతున్నవారు చాలా మందే ఉన్నారు.

గంటల తరబడి సినిమా టికెట్ల కోసం ఎదురుచూసేవాళ్లు కూడా ట్రాఫిక్ సిగల్స్ దగ్గర మాత్రం కాసేపు ఆగలేరు. రెడ్ సిగ్నల్ పడినా కూడా వాహనాన్ని పోనిస్తుంటారు.అలాంటివాళ్లంతా ఈ నోరులేని ఆవును చూసి నేర్చుకోవాల్సిందే. రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలతో పాటు ఆవు కూడా ఆగిపోయి వాహనదారులను ఆశ్చర్యపరిచింది. 
తప్పు చేసిన మనిషిని పట్టుకుని జంతువులతో పోల్చి తిడుతుంటారు. ఈ ఆవును ఇక నుంచి జంతువులతో పోల్చి తిట్టడం మానేస్తారు. ఎందుకంటే.. మనకంటే అవే చాలా బెటర్ అని ఈ వీడియో స్పష్టంగా చెబుతోంది.

ఇంతకీ ఈ ఆవును మనకు పరిచయం చేసింది బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింటా. రెడ్ సిగ్నల్ పడగానే సరిగ్గా జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆవు ఆగిపోయింది. సిగ్నల్ పడేంత వరకు వేచి చూసి వెళ్లింది. ఇదంతా వీడియో తీసి తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది ప్రీతి.

‘జనం సంగతి పక్కన పెడితే.. చివరికి జంతువులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయి. నమ్మడం లేదా.. అయితే ఈ వీడియో చూడండి’ అని ప్రీతి పేర్కొంది. దీంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది ఆ ఆవు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. రాను రాను మనుషులే జంతువుల కన్నా హీనంగా తయరవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios