హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఓ చిన్నారిని బ్రతికుండగానే పూడ్చిపెట్టడానికి ప్రయత్నించిన దుండగున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హృదవిదారక సంఘటన హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

 read more భవన నిర్మాణ కార్మికుడి భార్య అనుమానాస్పద మృతి

వివరాల్లోకి వెళితే... జూబ్లీ బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి అప్పుడే పుట్టిన చిన్నపాపతో అనుమానంగా తచ్చాడుతుండటాన్ని ఓ ఆటో డ్రైవర్ గుర్తించాడు. చెట్ల పొదల్లో అతడేదో దుర్మార్గానికి పాల్పడుతున్నట్లు అనుమానం వచ్చిన సదరు ఆటోవాలా స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. 

సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడి సంఘటనను చూసి పోలీసులు  విస్తుపోయారు. 

read more  video: దారుణం... సచివాలయ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

తన వద్ద వున్న చిన్నారిని బ్రతికుండగానే పూడ్చిపెట్టడానికి నిందితుడు సిద్దమయ్యాడు. జేబిఎస్ వద్ద ఖాళీ స్థలంలో హరిత హారంలో మొక్కలు నాటడానికి తీసిన గొయ్యిలో పూడ్చిపెట్టడానికి సిద్దమయ్యారు. ఆటోవాలా చూడటం, పోలీసులు రావడం ఆలస్యమయి వుంటే చిన్నారిని అతడు పూడ్చిపెట్టేవాడు. అయితే ఆ దారుణం జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు.

అయితే పోలీసులు నిందితున్ని ప్రశ్నించగా... తనది కరీంనగర్ అని, మనవరాలు చనిపోవడం తో పూడ్చి పెడుతున్నామని నిర్భయంగా వెల్లడించాడు. శిశువు బ్రతికే వున్నట్లు తెలుస్తున్నా అతడు పోలీసులకు అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

"

దీంతో అతడి నుండి శిశువున్న తీసేసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం దగ్గర్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే దుండగున్ని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.

ఆడబిడ్డ జన్మించిందనే ఈ దారుణానికి ఒడిగట్టివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఆడబిడ్డ జన్మించిందనే ఈ దారుణానికి ఒడిగట్టివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నిందితుడు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదని పోలీసులు చెబుతున్నారు. అతడి నుండి నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.