నూజివీడు: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణ కార్మికుడి భార్య అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషాద సంఘటన నూజివీడులో చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 

నూజివీడు కొత్తపేటకు చెందిన సత్తిబాబు(30) తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతడు తన భార్య కళ్యాణి (27), పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఆమె నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని చనిపోయింది. అయితే ఇది హత్యా...ఆత్మహత్యా అనేది పోలీస్ విచారణలో తేలాల్సి వుంది. 

readmore  జైల్లో చింతమనేనిని పరామర్శించిన నారా లోకేష్
 
గత కొంతకాలంగా బార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. భర్త సత్తిబాబుని మద్యం సేవించే అలవాటు మనుకోమని భార్య పదే పదే చెప్తూ ఉండేదని, అయినా అతను పెడచెవిన బెట్టి నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చే వాడని ఇరుగుపొరుగు చెప్తున్నారు. 

స్ధానికుల నుండి సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

read more video: దారుణం... ఇసుక కొరతతో కార్మికుడి సెల్ఫీ సూసైడ్

తమ బిడ్డ మృతికి ఆమె భర్తే కారణమని, తమకు న్యాయం చేయాలంటూ మృతురాలు తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. దీంతో వీరి ఇద్దరు పిల్లల భవితవ్యం ప్రశ్నార్థకమంగా మారింది. అటు తల్లి మరణించి, తండ్రి అభియోగాలు ఎదుర్కోంటుండటంతో పిల్లల మరింత పరిస్థితి ధీనంగా మారింది.