సచివాలయం ఉద్యోగం రాలేదన్న తీవ్ర మనస్తాపంతో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. తన మీదనే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేయలేక పోయినందుకు మన్నించమని అంటూ చివరి లేఖ రాసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ విషాదకర సంఘటన కర్నూలు పట్టణంలోని పీవి నరసింహారావు నగర్ లో చోటుచేసుకుంది. 

పాణ్యం మండలానికి చెందిన ప్రియాంకకు రెండు సంవత్సరాల నుండి అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్‌ గూడూరు మండలంలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తోంది. అయితే అప్పటి నుండి ఆ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఆ  ప్రయత్నాలన్ని విఫలం కావడంతో ఇక లాభం లేదనుకుని ఇటీవల ప్రభుత్వం నోటిపికేషన్ జారీ చేసిన సచివాలయ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. 

ఈ ఉద్యోగానికి కి అప్లై చేసి అర్హత సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ అవి సక్సెస్ కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయనందుకు తనువు చాలించాలని కఠిన నిర్ణయం తీసుకుంది.

"

గూడూరులో విధులు ముగించుకున్న ప్రియాంక నగరంలోని పీవీ నరసింహారావు నగర్ లోని తన గదికి సాయంత్రం చేరుకుంది. గదిలోని ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని బలవంతపు మరణానికి పాల్పడింది.

ప్రియాంక కోసం  ఆమె గదికి వచ్చిన స్నేహితురాలు గమనించి ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 

ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ప్రియాంక వద్ద అ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను సచివాలయ ఉద్యోగం సాధించలేక పోయినందుకు తండ్రికి క్షమాపణ చెబుతూ చివరి లేఖను రాసింది. తన మరణంతో ఎవరు దిగులు పడవద్దని...  అక్కను బాగా చూసుకోవాలని అందులో కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

read more సచివాలయానికి డుమ్మా... మంత్రులపై జగన్ సీరియస్

తల్లి రజిత హత్య: కీర్తితో మద్యం తాగించి, రెచ్చగొట్టిన శశికుమార్