హైదరాబాద్: హైదరాబాదులోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు పడడంతో మరణించిన మహిళను పోలీసులు గుర్తించారు. ఫ్లైఓవర్ కింద ఆటో కోసం ఎదురు చూస్తుండగా ఆమెపై పిడుగులా ఫ్లై ఓవర్ నుంచి ఎర్రటి కారు పడింది. మృతురాలిని 40 ఏళ్ల సత్యవేణిగా గుర్తించారు. 

కారు పడిన సమయంలో ఫ్లై ఓవర్ కింద మృతురాలితో పాటు ఆమె కూతురు నిలబడి ఉన్నారు. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. కాగా, ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో కారు డ్రైవర్ మిలన్ (27) కూడా ఉన్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)

ప్రమాదంలో బాలరాజు (40), కుబ్రా (23), మృతురాలి కూతురు ప్రణీత (26) ఉన్నారు. గాయపడినవారిని హైటెక్ సిటీలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సినిమా షూటింగ్ జరుగుతోందని తొలుత సంఘటనా స్థలంలో ఉన్నవారు అనుకున్నారు. కానీ, అది ప్రమాదమని తెలిసి ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. 

ప్రమాదానికి గురైన ఎర్రటి వోక్స్ వ్యాగన్ కారు ఫ్లై ఓవర్ పై గంటకు 104 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ కింద పడిపోయిందని పోలీసులు చెబుతున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: హైదరాబాద్: ఫ్లైఓవర్ నుంచి కింద పడ్డ కారు, విధ్వంసం, మహిళ మృతి

మితిమీరిన వేగం కారణంగా కారు ఫ్లైఓవర్ రెయిలింగ్ ను ఢీకొట్టి కింద పడిపోయింది. నిసాన్ షోం రూమ్ వద్ద పార్క్ చేసి ఉన్న రెండు కార్లు కూడా ధ్వంసమయ్యాయి.

దాదాపు 990 మీటర్లు ఉండే బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ వన్ వే. అది దివ్యశ్రీ ఓరియోన్ సెచ్ వద్ద ప్రారంభమైన బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ముగుస్తుంది. ఫ్లై ఓవర్ మలుపులు తిరిగి ఉంటుంది. ఈ ఫ్లై ఓవర్ ను రూ.69.47 కోట్ల వ్యయంతో నిర్మించారు. 

ఫ్లై ఓవర్ మీదికి పాదచారులను అనుమతించారు. వాహనాల వేగం కూడా గంటకు 40 కిలోమీటర్లు మించకూడదనే నిబంధన విధించారు. సెల్ఫీల కోసం గానీ ఇతరత్రా గాని ఎవరినీ ఫ్లై ఓవర్ మీదికి అనుమతించరు. 

అతి వేగం కారణంగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు.