హైదరాబాద్: హైదరాబాదులోని బయో డైవర్సటీ ఫ్లై ఓవర్ పై కారు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ నుంచి కారు కిందపడింది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. ఓ మహిళ మృత్యువాత పడింది.. 

గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు అదుపు తప్పి ఫ్లై ఓవర్ నుంచి కింద పడింది. ప్రమాదంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫ్లై ఓవర్ వెళ్తున కారు కింద పడి పల్టీలు కొడుతూ మరో కారుపై పడింది. ఆటో కోసం నిరీక్షిస్తున్న మహిళ మృత్యువాత పడింది. మితిమీరిన వేగంలో కారణంగా ఫ్లై ఓవర్ పై నుంచి కారు కింద పడినట్లు భావిస్తున్నారు.

ఫ్లై ఓవర్ నుంచి కారు పడిన ఘటన కారణంగా సంఘటనా స్థలంలో విషాదకరమైన వాతావరణం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా చెట్లు విరిగి, ఇతర కార్లపై కూడా పడ్డాయి. ఎరుపు రంగు వోక్స్ వ్యాగన్ కారు కింద పడింది. ఈ ఘటనలో వోక్య్ వ్యాగన్ కారు తునాతునకలయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళకరంగా ఉంది. వోక్స్ వ్యాగన్ కారులో ఉన్న ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం చెరువు వరకు ట్రాఫిక్ ఆగిపోయింది.

వోక్స్ వ్యాగన్ ఎవరిదనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కారులో ప్రయాణిస్తూ గాయపడిన ముగ్గురు ఎవరనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. నెంబర్ గుర్తు పట్టరానంతగా కారు ధ్వంసమైంది.

వారం రోజుల ఈ ఫ్లై ఓవర్ పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ 15 రోజుల క్రితమే ప్రారంభమైంది. ఈ ఫ్లైఓవర్ పై శనివారం జరిగింది మూడో ప్రమాదం. ఇప్పటి వరకు ప్రమాదాల్లో ఈ ఫ్లై ఓవర్ పై ముగ్గురు మరణించారు..