Asianet News TeluguAsianet News Telugu

ఈ హైదరబాదీ మహిళకు ఫోన్ లోనే తలాక్ (వీడియో)

  • హైదరాబాద్ లో బయటపడ్డ మరో టెలిఫోన్ తలాక్ కేసు
  • న్యాయం చేయాలంటూ సుష్మా స్వరాజ్ కు లేఖ రాసిన బాధితురాలు
Yet another case of Telephone Talaq in Hyderabad

పాతబస్తీలో విదేశీ షేక్ ల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. అక్కడి ప్రజల పేదరికాన్ని అడ్డం పెట్టుకుని అమ్మాయిలను పెళ్లిళ్ళ పేరుతో విదేశీ షేక్ లు మోసం చేస్తున్న అనేక  సంఘటనలు ఇదివరకు చాలాసార్లు బయటపడ్డాయి. తాజాగా అలా ఓ ఓమన్ షేక్ ను పెళ్లి చేసుకుని, అతడి చేతిలో మోసపోయిన ఓ మహిళ విషాద సంఘటన పాతబస్తీలో తాజాగా వెలుగు చూసింది. 

వివరాల్లోకి వెళితే పాత బస్తి కి గౌసియా బేగం(31)కు సయ్యద్ జహ్రాన్ హమద్ అనే ఒమన్ షేక్ తో 2008 లో వివాహమైంది. అయితే ఈ మహిళకు పెళ్లి సమయంలో హైదరాబాద్ లో ఇల్లు తీసుకుని ఇక్కడే కాపురం ఉందామని అతడు నమ్మబలికాడు. అతడి మాటలు నిజమేనని నమ్మింది బాధితురాలు.అయితే పెళ్లి తర్వాత ఒమన్ వెల్లిపోయిన హమద్ అప్పుడప్పుడు హైదరాబాద్ కు రావడం, భార్యకు కుటుంబ ఖర్చుల కోసం డబ్బులు పంపించడం చేసేవాడు. కానీ పెళ్లి సమయంలో చేసిన హామీని నెరవేర్చకుండా మాయమాటలు చెప్పేవాడని గౌసియా తెలిపింది.

అయితే అతడు ఈ మద్య తనకు ఫోన్ చేసి ఫోన్ లోని తలాక్ చెప్పాడని, ఇక నీకు నాకు ఎలాంటి సంభందం లేదన్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఏ దిక్కు లేక తాను, తన తల్లి రోడ్డున పడ్డామని, ఈ వ్యవహారంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని గౌసియా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాసింది.  ఒమన్ లోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడి తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని మంత్రిని బాధితురాలు వేడుకుంది. 

Yet another case of Telephone Talaq in Hyderabad

  

Follow Us:
Download App:
  • android
  • ios