Asianet News TeluguAsianet News Telugu

అరెస్టుల మధ్య మొదలైన ప్రపంచ తెలుగు మహాసభలు

  • తెలుగు సభలకు బాగ్యనగరం రెడీ
  •  ఇవాళ ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య
  • ప్రారంభానికి ముందే కొనసాగిన అరెస్టులు
  • మహాసభలను బహిష్కరిస్తామన్న జర్నలిస్టు వేణును అరెస్ట్ చేసిన పోలీసులు
World Telugu Conference takes off amid arrests and protests

తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలు వ్యాపింపజేసి, తెలుగు బాష ఔనత్యాన్ని చాటిచెప్పడానికి తెలంగాణ సర్కార్ చేపడుతున్న బృహత్తర కార్యక్రమమే తెలుగు మహా సభలు. అలనాటి కాకతీయుల నుంచి నేటి కార్పోరేట్ కల్చర్ వరకు తెలుగ భాష, సంస్కృతి ఎన్నో రూపాల్లో మార్పు చెందింది. కాలానుగుణంగా మరుగునపడుతున్న తెలుగును పునరుజ్జీవింపజేయాలని తెలంగాణ సర్కార్ పూనుకుంది. అందుకోసం ఇవాళ తెలంగాణమంతా మురిసిపడేలా హైదరాబాద్ వేధికగా తెలుగు మహాసభలను నిర్వహిస్తోంది. దశాబ్దాల తరబడి తెలంగాణేతరుల పాలనలో  నిర్లక్ష్మానికి గురైన తెలంగాణ భాష, యాస, సంస్కృతులు, సాహిత్యం, వంటలు ఇలా ప్రతి ఒక్క విషయం గురించి తెలంగాణ ప్రజలకు తెలియాజేయాలన్న ఉద్దేశంతో ఈ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. 

 ఇవాళ ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభలు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభమవుతున్నాయి.  ఈ కార్యక్రమంలో వివిధ దేశాల్లో నివాసముంటగున్న తెలుగు బిడ్డలు ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు పాల్గొననున్నారు. శుక్రవారం మొదలయ్యే ఈ మహాసభలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ సభల్లో తెలుగు ఔన్నత్యాన్ని చాటే  అనేక సదస్సులు, కవి సమ్మేళనాలు, అవధానాలతో  తెలుగు సాహిత్యానికి, కళలకు పట్టం కట్టనున్నారు. 
 
 శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా ఈ మహాసభలను ప్రారంభిస్తారు.  ఈ సభలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించనున్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు విశిష్ట అతిథులుగా ఈ సభల్లో పాల్గొనననున్నారు. అంతే కాకుండా సభల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి తెలుగు బాషాభిమానులు, ప్రముఖులు, ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకొన్నారు. వారంతా పతనావస్థలో ఉన్న తెలుగు భాషను బ్రతికించడానికి జరిగే చర్చల్లో పాల్గొంటారు. ఈ సభలను హైదరాబాద్ లో వివిధ ప్రదేశాల్లో నిర్వహించనున్నారు.ఇప్పటికే ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంతో పాటు, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలంగాణ సారస్వత పరిషత్‌లన్నీ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా అలంకరించారు. 
 

అయితే ఈ సభల ప్రారంభంరోజే తెలంగాణ ఉద్యమ కారుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని వేణు పిలుపునివ్వడంతో ఈ అరెస్ట్ జరిగింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు అతడు అంతరాయం కల్గిస్తున్నాడేమోనన్న అనుమానంతో ప్రభుత్వం వేణు అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. 
 

తెలంగాణ సంస్కృతిలో తెలుగు బాష ఎలా మిళితమయ్యిందో తెలియజెప్పే  ఈ ప్రపంచ తెలుగు మహా సభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల తర్వాత అయినా తెలుగు భాష, సంస్కృతి పూర్వ వైభవాన్ని పొందాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

మరిన్ని వార్తల కోసం ఆ కింది లింక్ ను క్లిక్ చేయండి

https://goo.gl/Sdegky


 

Follow Us:
Download App:
  • android
  • ios