సంగీత కేసులో షాకింగ్ ట్విస్ట్

సంగీత కేసులో షాకింగ్ ట్విస్ట్

భర్త శ్రీనివాస్ రెడ్డి చేతిలో చిత్రహింసలకు గురై అతడి ఇంటిముందు దీక్షకు దిగిన సంగీత కేసులో ఊహించని పరిణామం జరిగింది. ఆమెకు అండగా నిలబడి దీక్షకు మద్దతిస్తున్న రెండు మహిళా సంఘాల మద్య వాగ్వాదం జరిగింది. ఇక దీక్షను విరమించమని ఓ మహిళా సంఘం సూచించగా, వద్దు కొనసాగించాలని మరో సంఘం పట్టబట్టింది. దీంతో ఇరు సంఘాల మద్య  వివాదం చెలరేగింది.
ఈ వివాదానికి సంభందించిన వివరాలిలా ఉన్నాయి. టీఆర్ఎస్ యూత్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి ఆడపిల్ల పుట్టందనే కారణంతో భార్య సంగీతను వదిలించుకోవాలని చూశాడు. దీంతో మరో మహిళను వివాహం చేసుకుని ఇంట్లోనే కాపురం పెట్టాడు. ఇదేమిటని ప్రశ్నించిన సంగీతను చితకబాది ఇంట్లోంటి బయటకు గెంటేసిన విషమం తెలిసిందే. ఆమెను కొడుతున్న వీడియోలు మీడియాకు చేరడంతో అది పెద్ద వివాదంగా మారింది. వారి చేతిలో తీవ్రంగా దెబ్బలుతిన్న సంగీత భర్త ఇంటి ముందు దీక్షకు దిగి నేటితో ఐదు రోజులవుతోంది. 
అయితే మొదటినుంచి ఈమె దీక్షకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఆమెకు అండగా నిలబడి దైర్యాన్నిచ్చాయి. అయితే ప్రస్తుతం సంగీత డిమాండ్ చేసినట్లే భర్తతో పాటు అత్త, మామలు, మరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు. కావున ఇక దీక్ష విరమించాలని స్థానిక మహిళా సంఘాలు సంగీతకు సూచించాయి. అయితే అత్తమామలు ఇక్కడికి వచ్చి సంగీతకు న్యాయం చేసేలా హామీ ఇచ్చేవరకు విరమించేది లేదని మరో సంఘం పేర్కొంది. దీంతో మాటా మాటా పెరిగి ఇరు మహిళా సంఘాల మద్య వాగ్వివాదం జరిగింది.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos