ఇటీవల కాలంలో అక్రమ సంబందాల కారణంగా అనేక హత్యలు  తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈ తరహా హత్యల్లో ఎక్కువగా మగ వాళ్లే బలయ్యారు. భార్యలు అక్రమ సంబంధం పెట్టుకుని భర్తలను మట్టుబెట్టిన ఘటనలు కోకొల్లలుగా జరిగాయి. నాగర్ కర్నూల్ స్వాతి రెడ్డి, మహబూబ్ నగర్ లక్ష్మి వరకు  అక్ర సంబంధ హత్యలు కొనసాగాయి. అక్రమ సంబంధాల కారణంగా ప్రియులతో కలిసి భర్తలను చంపుతున్నారు భార్యలు. ఇలాంటిదే ఓ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

 హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుత్బుల్లాపూర్‌ గ్రామంలో ఇటీవల హత్యకు గురైన సింహాచలం కేసును పోలీసులు చేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాలానగర్‌ ఏసీపీ గోవర్దన్‌ విలేకర్లకు వెల్లండించారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు సింహాచలం భార్య విజయ(33) కు గౌరినాయుడు(34) అనే  వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన విజయ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడానికి కుట్ర పన్నింది. మద్యం మత్తులో పడుకున్న భర్తను ప్రియుడి సహకారంతో  గొంతునులిపి చంపేసింది.  అనంతరం తన భర్త తాగిన మైకంలో నిద్రలోనే మృతి చెందాగడని బందువులకు నమ్మించింది.

అయితే విజయ మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో మృతిడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయను పోలీసులు విచారించగా అసలు నిజాలు బైటపెట్టింది. దీంతో విజయను ఆమె ప్రియుడు గౌరినాయుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.