Asianet News TeluguAsianet News Telugu

ఆగస్టు 12న ఆకాశంలో మహా అద్భుతం..

  • మానవ చరిత్రలో కనీ వినీ ఎరగని అద్భుతం
  • భూమి మీద ఉల్కల వర్షం
Will the August 12 meteor shower be the brightest in history

 

మానవ చరిత్రలో కనీ వినీ ఎరగని అద్భుతం జరగబోతోందా.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఏమిటా అద్భుతం అంటారా.. భూమి మీద ఉల్కల వర్షం కురవబోతోంది. ఉల్కల గురించి వినే  ఉంటారు. ఆకాశం నుంచి అప్పుడప్పుడు ఉల్కలు భూమి మీద పడుతూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఒకేసారి ఒకటో రెండో  ఉల్కలు పడ్డాయి.

కాగా.. వచ్చే నెల ఆగస్టు 12వ తేదీ రాత్రి సమయంలో ఎక్కువ మొత్తంలో ఉల్కలు భూమి మీద పడనున్నాయి. దీనిని ఉల్కల వర్షంగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ఈ విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు అధికారికంగా తెలియజేశారు. ఆ రోజు అత్యంత ఎక్కువ వెలుగుతో ఉల్కలు భూమిని చేరే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అరుదైన వాటిని జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే చూడగలం. మళ్లీ ఇటువంటి వర్షం కురవాలంటే మరో 96 సంవత్సరాలు ఆగాల్సిందేనని వారు చెబుతున్నారు.

ఈ ఉల్కల వర్షం పడే సమయంలో 109పి/స్విఫ్ట్- టుటిల్ అనే తోకచుక్క  సౌర వ్యవస్థ చుట్టూ అనేక సార్లు పర్యటిస్తుంది. ఈ ఉల్కలు గంటకు 80 నుంచి 100 మీటర్లకు కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios