నారావారి పల్లెలో బావ కుటుంబంతో కలిసి బాలయ్య పండగ సంబరాలు ఊరి మహిళలతో మమేకమైన బాలయ్య బాబు

సంక్రాంతి పండగను తన బావ చంద్రబాబు కుటుంబంతో కలిసి నందమూరి బాలయ్య కుటుంబం కూడా నారావారి పల్లెలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే కేవలం సీఎం కుటుంబంతోనే కాదు ఆ ఊరి ప్రజలతోను బాలయ్య మమేకమయ్యారు. పల్లె ఆడపడుచులకు పసుపు, కుంకుమ, పండ్లను ధానం చేసి వారి నారావారి పల్లె మహిళల మనసులు గెలుచుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని లోకల్ గా ఉండే టిడిపి కార్యకర్తలు సమన్వయం చేశారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ..బాలయ్య బాబు చేతుల మీదుగా వీటిని తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred