ఈ వరంగల్ పోలీస్ ఎం చేసిండో తెలుసా ?

warangal police illegal affairs
Highlights

  • వరంగల్ మహిళా పీఎస్ రాజేందర్ రాసలీలలు
  • బయటపెట్టిన అతడి భార్య, కొడుకు

కట్టుకున్న భార్య, పెళ్లైన కొడుకు చక్కటి కుటుంబం ఉండగా ఓ వరంగల్ పోలీస్ రెండో..కాదు కాదు మూడో ప్యామిలీ పెట్టి అడ్డంగా దొరికి పోయిన ఘటన హైదరాబాద్ లోని మేడిపల్లి లో జరిగింది. అతడిని స్వయంగా మొదటి భార్య, కొడుకు, కోడలు కలిసి వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. 

వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా సుబేదారి మహిళా పీఎస్ లో రాజేంధర్  హెడ్ కానిస్టేబుల్ గా  పని చేస్తున్నాడు. అయితే అతడికి భార్య , పిల్లలు ఉన్నా కూడా విడాకులు ఇవ్వకుండా మరో రెండు ఫ్యామిలీ లు మెయింటైన్ చేస్తున్నాడు. ఇది మొదటి భార్యకు తెలిసినా కుటుంబ పరువు పోతుందని మౌనంగా ఉంది. అయితే ఈ మద్య అతడు అసలు ఇంటికి రావకపోవడం,వీరిని పట్టించుకోక పోవడంతో విసుగు చెందిన ఆమె కొడుకు సాయంతో అతడిని గుట్టు బట్టబయలు చేసింది. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ లోని మూడవ భార్య ఇంట్లో ఉండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.
ఈ వ్యవహారంపై మొదటి బార్య మీడియాతో మాట్లాడుతూ...వేరే మహిళలతో అక్కమ సంభందాలు నడుపుతున్నా తాను ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని అన్నారు. అయితే ఈ మద్య అతడి వ్యవహారాల వల్ల కుటుంబంలో మనశ్శాంతి కరువైందని, అందువల్ల ఈ బండారాన్ని బయటపెట్టాల్సి వచ్చిందని ఆవేదనగా తెలిపింది. 

 ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కానిస్టేబుల్ రాజేంద్రన్ పై విచారణ కు ఆదేశించారు. అతడి కొడుకు కూడా కానిస్టేబుల్ అవ్వడంతో అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న మేడిపల్లి పోలీసులు ఉన్నతాధికారులకు అందించారు.  దీంతో అతడిపై వేటు పడే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నారు.  

loader