వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ 2018 పెస్టివల్ ముగింపు వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న రెండు విద్యార్థి గ్రూప్ ల మద్య గ్యాంగ్ వార్ చెలరేగింది. విద్యార్థుల మద్య మాటా మాటా పెరిగి కత్తులతో ఒకరిపై ఒకరు దాడికి దిగేంత వరకు వెళ్లింది ఈ ఘర్షణ. ఈ గొడవకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.    

వరంగల్ నీట్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ 2018 వేడుకులకు నిన్న ముగింపు కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెండు విద్యార్థి గ్రూప్ ల మద్య చిన్నగా మాటలతో మొదలైన ఘర్షణ కత్తులతో దాడులు చేసుకునేంత దూరం వెళ్లింది. ఈ కత్తుల దాడిలో  త్రివంత్‌ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో అతడిని చికిత్స కోసం వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  

కార్యక్రమం జరుగుతుండగానే విద్యార్థుల మద్య గొడవ జరగడంతో అధికారులు ఈ కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో నీట్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. 

 

వీడియో