వరంగల్ కేయూలో కొట్టుకున్న విద్యార్థులు (వీడియో)

First Published 23, Feb 2018, 6:27 PM IST
warangal kakathiya university students fight
Highlights
  • రణరంగంగా మారిన కాకతీయ యూనివర్సీటి
  • విద్యార్థుల మద్య గొడవ

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇవాళ విద్యార్థి సంఘాలు, ఇంజనీరింగ్ విద్యార్థుల మద్య గొడవ జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  యూనివర్సిటీ పరిధిలో పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగుతున్నాయంటూ విద్యార్ధి సంఘాలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీలోని అన్ని డిపార్ట్ మెంట్లకు, కాలేజీలకు తిరుగుతూ మూసేయించారు. ఇదే విధంగా ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌ను కూడా బంద్ చేయించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు బంద్ పాటించడానికి ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థి సంఘాలకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు మద్య గొడవ జరిగింది.

యూనివర్సిటీలో గొడవ గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.    

కేయూ విద్యార్థుల గొడవ వీడియో

 

loader