పెళ్లి తర్వాత ఆమ్రపాలికి కొత్త బాధ్యతలు

పెళ్లి తర్వాత ఆమ్రపాలికి కొత్త బాధ్యతలు

 రెండు రోజుల క్రితమే పెళ్లి చేసుకుని ఇంకా ఆ వేడుకల్లో బిజీగా వున్న ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ ఆమ్రపాలి ని నియమాస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరంగల్ డిసిసిబి పాలక వర్గం పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ పాలక వర్గం స్థానంలో ప్రతేక అధికారిగా జిల్లా కలెక్టర్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

ఈనెల 3వ తేదీతో రాష్ట్రంలోని అన్ని డీసీసీబీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. అయితే పదవీ కాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం అనేక కారణాలతో వాటిని నిర్వహించలేక పోయింది. దీంతో డీసీసీబీలు పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు మాసాలు పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంభందించిన అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక వర్గాలను మాత్రం కొనసాగించడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసింది. అవినీతి ఆరోపణలతో విచారణ సాగుతున్న, రద్దు కాబడిన డీసీసీబీల బాధ్యతను ప్రత్యేక అధికారులకు అప్పగించారు.

ఇలాగే వరంగల్ డిసిసిబి పాలకవర్గం కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ రద్దయింది. దీంతో వరంగల్ డిసిసిబి పాలన బాధ్యతలు జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి అప్పగించారు.  ఎన్నికలు నిర్వహించే వరకు రూరల్‌ కలెక్టర్‌ డీసీసీబీకి ప్రత్యేక అధికారిగా కొనసాగనున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos