ఆమ్రపాలి తెలంగాణ ప్రజలకు బాగా సుపరిచితమైన పేరు. కలెక్టర్ గా వరంగల్ అర్బన్ జిల్లాలో ఎంత డైనమిక్ గా పాలన సాగిస్తున్నారో అందరికీ తెలిసిందే. పాలనా పరంగానే కాకుండా అడవుల్లో ట్రెక్కింగ్ లు, కొండలపై రాక్ క్లైంబింగ్ లతో ఫిట్ నెస్ పరంగా కూడా ఆదర్శవంతంగా నిలిచారు.  ఇవే కాకుండా ఇటీవల రిపబ్లిక్ వేడుకల్లో ఆమె చేసిన ప్రసంగం లో నవ్వుతూ విమర్శలపాలైనప్పటికి బాగా పాపులర్ అయ్యారు. ఇలా ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆ కలెక్టర్ పెళ్లి, హనీమూన్ ప్లానింగ్ కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆమె పెళ్లికి ముందే హనీమూన్ కి ఎక్కడికి వెళ్లాలో ఫ్లాన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పు మంటున్నాయి.  ఈ విషయాలు తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆమ్రపాలి తెలంగాణ లో కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈమె పెళ్లి డిల్లీకి చెందిన 2011 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మతో జరగనుంది. ఈయన ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ డామన్‌ ఎస్పీగా పని చేస్తున్నారు.  ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. ఇందు కోసం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7 వరకు కలెక్టర్ ఆమ్ర పాలి సెలవు తీసుకోనున్నారు. పెళ్లి తర్వాత ఈ నెల 22న వరంగల్ లో, 25న హైదరాబాద్‌లో సన్నిహితులకు గ్రాండ్ పార్టీ  ఇవ్వనున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పురప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే హోటల్స్ బుకింగ్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. 

ఈ తంతు తర్వాత నూతన వదూవరులు హనీమూన్ ట్రిప్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈనెల 26 నుంచి మార్చి 7 వరకు ఈ నూతన జంట టర్కీ పర్యటనకు  వెళ్లనున్నారు. టర్కీ పర్యటన నుండి వచ్చిన తర్వాత ఆమ్రపాలి డ్యూటీలో చేరనున్నట్లు వరంగల్ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.