వరంగల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జేపీఎస్‌ రోడ్డులో గల రాజ చిల్డ్రన్ హాస్పిటల్ అగ్నికి ఆహుతయ్యింది. ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మొదలైన మంటలు అంతకంతకు పెరుగుతూ ఎగసిపడ్డాయి. ఈ అగ్నికి హాస్పిటల్ లోనే వున్న మెడికల్ షాపు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఆస్పత్రిలో చిన్నారులు కానీ వారి సంబంధీకులు కానీ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పూర్తిగా కాలిపోయిన ఆస్పత్రిని పోలీసులు పరిశీలించారు.   
 

వీడియో