విరసం నేత వరవరరావు అరెస్ట్

virasam member poet Varavara Rao arrested
Highlights

విరసం నేత వరవరరావు అరెస్ట్

నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

 తెలుగు మహాసభలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన విరసం నేత వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇదే విషయంపై తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్ట్, వరవరరావు మేనల్లుడైన వేణును  అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

తెలుగు మహాసభలు ఇవాళ ప్రారంభమవనున్న నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద వరవరరావును పోలీసులు అరెస్ట్ చేసారు. 

విరసం తరపున ఈ సభలను అడ్డుకోవాలని వరవరరావు పిలుపునిచ్చారు. దీంతో సభను అడ్డుకునే అవకాశాలున్నాయన్న అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
అతడిని బాగ్ లింగంపల్లి నుంచి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

loader