విజయవాడ లో  కృష్ణలంకలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కృష్ణలంకలో కలకలం సృష్టించింది. 

ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... విజయవాడ నేరపరిశోధన విభాగం (సీసీఎస్)లో నాగమణి అనే మహిళ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈమె గత రాత్రి విధులు నిర్వహించి ఇంటికి వెళ్ళింది. అయితే అదే రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కృష్టలంక పొలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. నాగమణి ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.