విజయవాడ రాణిగారి తోటలో దారుణం డబ్బుల కోసం బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు విషయం పోలీసుల వరకు చేడంతో బాలుడిని హత్య చేసిర దుండగులు
విజయవాడ కృష్ణలంకలో దారుణం జరిగింది. డబ్బుల కోసం బాలుడ్ని కిడ్నాప్ చేసి దుండగులు, చంపేసి చెరువులో పడేసారు.

వివరాలిలా ఉన్నాయి
కృష్టలంక రాణీ గారి తోటకి చెందిన నడింపల్లి సాయి శివ చరణ్ బాలాజీ నగర్ రవీంద్ర భారతి స్కూల్ లో మూడవ తరగతి చదుతున్నాడు
నిన్న సాయంత్రం తండ్రి కనకరావుతో కలసి రాణీ గారితోటలో సెంటర్ లో ఉన్నాడు
అదే వీదిలో నివాసం ఉండే బిర్లా అలియాస్ మస్తాన్ ఐస్ క్రీం బండి నడుపుతాడు. పిల్లలు అందరికి ఐస్ క్రీం ఇచ్చి డబ్బులు వారి తల్లిదండ్రులు దగ్గర తీసుకోవడం బిర్లా కి అలవాటు.
అదే విధంగా రాత్రి కనకరావు కుమారుడు సాయి శివ చరణ్ ఐస్ క్రీం అడగటం తో బిర్లాకు ఐస్ క్రీం ఇవ్వమని చెప్పి కనకరావు ఆటోనగర్ వెళ్ళాడు.
తిరిగి రాత్రి 10గం ఇంటికి వచ్చి కుమారుడు గురించి అడగగా ఇంటికి రాలేదు అని చెప్పటం తో పోలిసులు కి ఫిర్యాదు చేశారడు.
అయితే రాత్రి సమయంలో తండ్రి కనకరావు కి ఫోన్ కాల్ వచ్చింది. మీ కుమారుడు కావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. వెంటనే అతడు పోలిసులకు తెలియజేశాడు. దీంతో పోలిసులు, పిల్లాడి తండ్రి బందర్ రోడ్డు కి వెళ్లారు.
మళ్ళీ పోన్ చేసిన దుండగులు పీవిపి సందులోని ఆర్కే చికెన్ సెంటర్ దగ్గర సైకిల్ ఉంటుందని దాని మీద డబ్బులు పెట్టి వెళ్లండని చెప్పారు.దీంతో అక్కడికి పోలిసులు వెళ్ళే సరికి ఐస్ క్రీం అమ్మే బిర్లా ఉన్నాడు. అతడితో పాటు ఉన్న మరో వ్యక్తి పరారయ్యడు.
దీంతో బిర్లాను పట్టుకున్న పోలీసులు రాత్రంతా విచారించినప్పటికి ఎలాంటి సమాచారం చెప్పలేదు.
తర్వాత రోజు పారిపోయిన మరో వ్యక్తి ని పట్టుకోవటం తో విషయం బయటపడింది.
ఇంటర్ చదువుతున్న కిషోర్ తో కలసి బిర్లా ఈ పని చేసినట్లు అంగీకరించారు.
బాలాజీ నగర్ రవీంద్ర భారతి స్కూల్ ఎదురు బందరు కాలువ లో శవాన్ని పోలిసులు కి చూపించిన నిందితులు.
ఇటీవల కనకరావు ఇల్లు అమ్ముకోవడం తో డబ్బులు వచ్చాయి. అది తెలుసుకున్న బిర్లా డబ్బులు కొసమే ఈ ఇంటర్ విద్యార్థితో కలిసి ఈ చేశాడని పోలీసులు తెలిపారు.
