ఈ రోజు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

First Published 20, Nov 2017, 11:25 AM IST
vice precident venkaiah naidu hyderabad tour
Highlights
  • ఉపరాష్ట్రపతి వెంకయ్య హైదరాబాద్ పర్యటన
  • ఈ సంధర్భంగా నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఇవాళ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సంధర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.  ఉపరాష్ట్రపతి నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నందున ఆయన ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వాహనదారులు దీన్ని గమనించాలని పోలీసులు సూచించారు. 
ఈ ఆంక్షలు క్రింది విధంగా ఉండనున్నాయి.
 ఇవాళ ఉదయం బంజారాహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయం, మాసాబ్ ట్యాంక్, మహావీర్ ఆసుపత్రి, అయోధ్య జంక్షన్, నిరాంకరి, సైఫాబాద్, రవీంద్రభారతి మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు.
అలాగే సాయంత్రం 4.20 గంటల నుంచి 6.35 వరకు బంజారాహిల్స్  ఆయన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయం, మహావీర్ ఆసుపత్రి, సైఫాబాద్, రవీంద్రభారతి, గన్ పౌడ్రి, అబిడ్స్ జీపీవో, ఎంజేమార్కెట్, ఉస్మాన్గంజ్, నయాపూల్, చత్తబజార్, మదీనా, షాదాబ్ హోటల్, హైకోర్టు మార్గాల్లో వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించారు. 
 

loader