రోడ్డు ప్రమాదంలో వీహెచ్‌పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా

vhp chief Pravin Togadias car met with an accident
Highlights

  • కారు ప్రమాదానికి గురైన ప్రవీణ్ తొగాడియా
  • నన్ను చంపేందుకే ఈ ప్రమాదం జరిగిందన్న తొగాడియా

విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ప్రమాదానికి గురయ్యారు. ఈయన ప్రయాణిస్తున్న కారు ను వేగంగా వచ్చిన లారీ డీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుండి తొగాడియా సురక్షితంగా బైటపడ్డారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని, తనను చంపడానికి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని తొగాడియా ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ప్రమాదం కాస్త హత్యాయత్నంగా మారింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.వీహెచ్‌పీ కార్యక్రమాల్లో బాగంగా తొగాడియా గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో బాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతుండగా సూరత్‌కు స‌మీపంలో ఆయ‌న‌ ప్రయాణిస్తున్న కారును భారీ ట్రక్ ఒకటి ఢీకొట్టింది. అయితే ఈ కారు బులెట్ ప్రూఫ్ కావడంతో ఫెను ప్రమాదం తప్పింది. తొగాడియాతో పాటు అందులో ప్రయాణిస్తున్న వారు  అందనూ సురక్షితంగా బైటపడ్డారు.

ఈ ప్రమాదంపై ప్రవీణ్ తొగాడియా  స్పందించారు.  తనను హతమార్చే  కుట్రలో డాగంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. తనకు జెడ్-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ స్థానిక పోలీసులు కనీసం తనవెంట ఎస్కార్ట్ టీమ్‌ను కూడా కేటాయించలేదన్నారు. ఈ రోజు తాను పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ను పోలీసులకు తెలిపినప్పటికి వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత నిర్లక్ష్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 

loader