సినీ నటుడు విజయ్ భార్య వనితారెడ్డి జూబ్లిహిల్స్ పోలీసుల ముందు ఇవాళ విచారణకు హాజరయ్యింది. విజయ్ ఆత్మహత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన వనిత హఠాత్తుగా జూబ్లిహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యింది. విజయ్ సెల్పీ వీడియోలో వెల్లడించిన విషయాలతో పాటు అతడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  పోలీసులు ఈ విచారణ చేపట్టారు. జూగ్లీహిల్స్ లో దాదాపు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.   

విచారణ అనంతరం బైటకు వచ్చిన వనిత మీడియాతో మాట్లాడింది. విచారణలో తనకు తెలిసిన అన్ని విషయాలు బైట పెట్టినట్లు తెలిపిన తెలిపింది. ఎవరికి బయపడి తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, తాను సాక్ష్యాలను సంపాదించాకే మాట్లాడదామని మౌనంగా ఉన్నట్లు తెలిపింది. తాను సంపాదించిన సాక్ష్యాలతో పాటు, విజయ్ కి సంభందించిన వీడియోలు కూడా పోలీసులకు అప్పగించినట్లు తెలిపింది. తాను పోలీసులు విచారణకు అన్నివిధాల సహకరించినట్లు తెలిపింది. తనను ఇరికించేందుకే విజయ్ తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారని వనిత ఆరోపించింది. విజయ్ తల్లిదండ్రులు తనపైన నేరం మోపి వారు తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపింది.

అయితే పోలీసులు తనకు నోటీసులు జారీచేశారని, మళ్లీ విచారణ కు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని సూచించారని వనిత తెలిపింది. విజయ్ కి సంభందించిన   వీడియోలు పోలీసులకు అప్పగించినట్లు , అవసరమైనపుడు వాటిని మీడియాకు కూడా అప్పగిస్తానని వనిత తెలిపింది.