స్కూల్లో టీచర్ మందలించాడని ఓ స్కూల్ విద్యార్థి ఇంట్లోంచి పారిపోయిన సంఘటన హైదరాబాద్ వనస్థలిపురం లో చోటుచేసుకుంది. దీంతో పిల్లాడి తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బైటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విదంగా ఉన్నాయి. 

వనస్థలిపురం ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన అలీ అనే విద్యార్థి స్థానికంగా వున్న లోటస్ లాప్ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇతడు స్కూల్ కి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంలతో ఆగ్రహించిన ఓ టీచర్ ఫోన్ ను లాక్కుని రేపు  తల్లిదండ్రులను స్కూల్ కి తీసుకురావాలని హెచ్చరించాడు. దీంతో భయపడిన అలీ స్కూల్ నుండి ఇంటికెళ్లగానే ఓ లెటర్ రాసిపెట్టి వెళ్లిపోయాడు. తమ కుమారుడు ఇలా లెటర్ రాసిపెట్టి ఇల్లు వదిలి వెళ్లిపోడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ బాలుడి మిస్సింగ్ పై తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నవనస్థలిపురం పోలీసులు విద్యార్థి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.  

విద్యార్థి మిస్సింగ్ పై స్పందించిన బాలల హక్కుల సంఘం దీనికి కారకులైన స్కూల్ సిబ్బంది, యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు డిమాండ్ చేసింది.

 

వీడియో