వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం రెండు కార్లు అతివేగంతో ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కార్లలో ప్రయానిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

 ఇవాళ తెల్లవారుజామున వనపర్తి నుండి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న ఓ కారు మంచి స్పీడ్ లో ఉండగా పంక్చర్ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. దీంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న 8 మంది  అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు  ఆరుగురు పురుషులు ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.