ఉత్తర ప్రదవేశ్ లో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అధికార పార్టీ  బిజెపి దామాపూర్ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ దుర్మరణం చెందారు.  ఎమ్మెల్యేతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గన్ మెన్లు కూడా ఈ ప్రమాదంలో మృత్యువాతపడ్డారు.

 ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యూపీ అధికార పార్టీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ తన టొయోటా పార్యూన్ కారులో వ్యక్తిగత పనులపై బయలుదేరాడు. ఇతడు ప్రయానిస్తున్న కారు బిజ్నూర్ జిల్లా సితార్‌పూర్‌ సమీపంలోకి రాగానే ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళుతున్న కారు అంతే వేగంవగా వస్తున్న లారీని ఢీ కోట్టడంతో కారులో ఉన్న ఎమ్మెల్యే తో పాటు ఇద్దరు గన్ మెన్లు, డ్రైవర్ కూడా దుర్మరణం చెందారు. 

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదంపై కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

అయితే తమ పార్టీ ఎమ్మెల్యే మృతి పట్ల బిజెపి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ  శ్రేణులు సంతాపం ప్రకటించారు. పార్టీ తరపున ఎమ్మెల్యే కుటుంబానికి అండగా ఉంటామని  హామీ ఇచ్చారు.