Asianet News TeluguAsianet News Telugu

హిజ్రాల చీర‌ల వివాదంలో ఇర్కిన‌ కేంద్ర మంత్రి

  • హిజ్రాల పై సంచలన కామెంట్లు చేసిన కేంద్ర మంత్రి.
  • చీరల ధరించరాదని హుకుం
  • మండిపడ్డ హిజ్రా సంఘాలు
  • మాట  మార్చిన మంత్రి.
union Minister comments on trangensers sari

కేంద్ర‌ సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రి రాందాస్ అతువాలే హిజ్రాల పై సంచ‌ల‌న కామెంట్లు చేశారు. హిజ్రాలు ఆడ‌వారు, కాదు మ‌గ‌వారు కాదు.. అలాంటప్పుడు చీర‌ల‌ను ఎంద‌కు ధ‌రిస్తున్నారు.. వారు చీర‌ల‌ను ధ‌రించ‌రాద‌ని రాందాస్ అతువాలే అన్నారు. ఇప్పుడు ఆ మాటలు సంచ‌ల‌నం అయ్యాయి.

ఒక కార్య‌క్ర‌మంలో మంత్రి రాందాస్ అతువాలే హిజ్రాల‌ను ఉద్దేశించి వివాద‌స్ప‌ద వ్యాక్యలు చేశారు. ట్రాంజెడ‌ర్లు ఆడ కాదు, మ‌గ కాదు మ‌రీ ఎందుకు చీర‌ల‌ను క‌ట్టుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. హిజ్రాలు చీర‌ల‌ను క‌ట్టుకొవ‌ద్దు అని అన్నారు. ఆయ‌న ఆ మాట‌లు అన్న కొద్ది గంట‌ల‌లోపే దేశ వ్యాప్తంగా ఆయ‌న పై కేసులు న‌మోద‌య్యాయి.

దేశంలో ఉన్న హిజ్రా క‌మ్యూనిటీలు ఆయ‌న మాట‌ల‌ను త‌ప్పుప‌ట్టాయి. రాందాస్ త‌మ‌ను కించ‌ప‌ర్చేలా మాట్లాడార‌ని, త‌క్ష‌ణ‌మే ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని హిజ్రాలు డిమాండ్ చేశారు. మేము ఎలాంటి దుస్తువులు ధ‌రిస్తే  ఏంట‌ని, అస్స‌లు మీకు ఎందుక‌ని వారు ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు. మా మనోభావాలను రాందాస్ కించపర్చారని వారు అన్నారు. తక్షణమే ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. 


హిజ్రాల మాట‌ల‌కు మంత్రి రాందాస్ కూడా త‌క్ష‌ణ‌మే స్పందించారు, నా ఉద్దేశం మాత్ర‌మే నేను చెప్పాన‌ని, హిజ్రాల‌ను కించ‌ప‌ర్చ‌డం త‌మ ల‌క్ష్యం కాద‌ని ఆయ‌న పెర్కొన్నారు. త్వ‌ర‌లో లోక్ స‌భ‌లో ట్రాంజేడ‌ర్ల రక్ష‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నాం అని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వివ‌రించారు. వివదానికి స్వస్తి చెప్పాలని ఆయన ప్రయత్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios