5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో ఏర్పాటు రూ.2600 కోట్ల వ్యయం అంచనా
రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్... పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో లోకేష్ పలు విషయాలపై చర్చించారు.
5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని ఈ సాందర్భంగా ఆయన చర్చించారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాల్సిన గ్రామాల వివరాలు,యాక్షన్ ప్లాన్ సంబంధిత వివరాలు కలెక్టర్ల నుండి సేకరించాలని సూచించారు.
సుమారుగా 10 వేల కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని.. ఇందు కోసం రూ.2600 కోట్ల వ్యయం అంచనా వేశారు.జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో నాణ్యమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చెయ్యాలని సూచించారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యాక్షన్ ప్లాన్...
*4.8.2017 లోపు పరిపాలనా అనుమతులు అన్ని పూర్తి చెయ్యాలి
*10.8.2017 లోపు మెటీరియల్ సప్లై పూర్తి కావాలి
*15.08.2017 లోపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శంకుస్థాపన కార్యక్రమం
*1.09.2017 లోపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల ప్రారంభం
*1.12.2017లోపు 100 గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రారంభం
*31.12.2017అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చెయ్యాలి
స్వచ్ఛ్ పంచాయతీలుగా అన్ని గ్రామాలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మార్గనిర్దేశం చేశారని.. అందులో భాగంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని లోకేష్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ జవహర్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు,
పంచాయతీ రాజ్,ఉపాధిహామీ పథకం అధికారులు పాల్గోన్నారు.
