హోళీ పండగ పూట సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుల్కల్‌ మండలంలోని కొర్పోల్‌ గ్రామంలో హోళీ వేడుకల తర్వాత నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోర్పోల్ గ్రామంలో యువకులు, చిన్నారులంతా కలిసి ఉత్సాహంగా రంగుల్లో మునిగితేలుతూ హోళీ పండగ జరుపుకున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రంగుల్లో మునిగి తేలిన ఇద్దరు చిన్నారులంతా కలిసి స్నానం కోసం మంజీరా నదికి వెళ్లారు.ఈ క్రమంలో సరదాగా నీళ్లలో ఆడుకుంటూ సాయికుమార్, సాయి కిరణ్ లు లోతులోకి వెళ్లారు. దీంతో ఈత రాని ఈ చిన్నారులిద్దరు నీట మునిగి చనిపోయారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా హోలీ ఆడిన చిన్నారులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.