టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ (వీడియో)

trs mla srinivas goud shocking comments
Highlights

  • సొంత పార్టీపైనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
  •  నాయిని చేసిన విమర్శలకు మద్దతు

టిఆర్ఎస్ నేతలు స్వరం పెంచుతున్నారు. ఏకంగా అధినేత కేసిఆర్ వైఖరినే ఎండగట్టేలా వారు విమర్శలకు దిగుతున్నారు. నిన్న హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి సొంత పార్టీ నేతలపైనే తిట్ల పురాణం అందుకుంటే ఇవాళ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కోరస్ పాడారు.  కేసిఆర్ ను తిట్టిన ముండాకొడుకులే... ఇవాళ తెలంగాణ కేబినెట్ లో కులుకుతున్నారు అని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హాట్ కామెంట్స్ చేసిన విసయం తెలిసిందే.  నాయిని మాట్లాడిన మాటలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ కోరస్ పాడారు. నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడిన మాటలు వందకు వంద శాతం నిజమే అన్నారు. ఉద్యమంతో సంబంధం లేని వారు మంత్రి వర్గంలో ఉన్నమాట వాస్తవమే అన్నారు. సీమాంధ్ర శక్తులతో కుమ్మక్కై తెలంగాణ సర్కారును కూలదోయాలనుకున్నవాళ్లు కూడా నేడు కేబినెట్ లో ఉన్నారని విమర్శించారు. అయినా.. నాడు తెలంగాణ కోసం పనిచేయకుండా.. వ్యతిరేకంగా పని చేసిన వారే నేడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

శ్రీనివాస్ గౌడ్ ఇంకా ఏం మాట్లాడారో కింది వీడియోలో చూడండి

 

loader