ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వాధికారులపై రెచ్చిపోయారు. మృదుస్వభావిగా పేరున్న కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా ఆవేశంతో ప్రభుత్వాధికారులపై రెచ్చిపోయాడు.   ఓ లారీలో బెల్లం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీ చేపట్టారు. దీంతో ఆ వ్యాపారులు స్థానిక ఎమ్మెల్యే కోనప్పకు సమాచారం అందించడంతో ఆయన అక్కడికి చేరుకుని వ్యాపారులకు మద్దతుగా మాట్లాడుతూ అధికారులను బండ బూతులు తిట్టారు. వారిపై దాడిచేయడానికి పైపైకి వెళ్లారు. దీంతో అధికారులు చేసేదేమి లేక అక్కడినుండి వెనుదిరిగారు. ఈ వ్యవహారం పై బాధిత అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

వీడియో