కొడంగల్ నియోజకవర్గంలో మంత్రుల పర్యటన పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి భారీగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడంతో టెన్షన్
కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ టెన్షన్ వాతావారణం నెలకొంది. నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ఱారావు లు నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమాలకు హాజరవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

