''కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డే ఇపుడు గొప్ప నాయకుడా'' ( వీడియో)

trs leader karne prabhakar fires on revanth reddy
Highlights

  • రేవంత్ పై విరుచుకుపడ్డ కర్నె ప్రభాకర్
  • ఆయన రాజీనామా గురించి కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడరు
  • వారిది గురివింద నీతేనన్న కర్నె ప్రభాకర్

కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, జానా రెడ్డి, జైపాల్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డినే గొప్ప నాయకుడిగా బావిస్తోందని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి గురివింద నీతిని ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. తమ రాజీనామాల గురించి మాట్లాడుతున్న షబ్బీర్ అలీ తమ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి రాజీనామా గురించి మాట్లాడాలన్నారు.  గన్ మెన్లను వద్దని చెప్పి, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎక్కడున్నాడో చూడాలంటూ షబ్బీర్ అలీకి సూచించారు.

కర్నె ప్రభాకర్ ఇంకా ఏమన్నాడో కింది వీడియోలో చూడండి

 

 

loader