Asianet News TeluguAsianet News Telugu

07 ఫిబ్రవరి 2018 బుధవారం. మీ రాశిఫలాలు

  • ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది.
Today February 7th your horoscope

మేషం

మేషం : ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

వృషభం

వృషభం : ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.


మిథునం

మిథునం : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం, అడ్డంకులు రావటం వల్ల మానసికంగా చికాకుకు, లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి.


కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీకు ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కడుపు లేదా ఛాతికి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. భూ, వాహనసంబంధ వ్యవహారాలు వాయిదా పడతాయి.


సింహం

సింహం : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం , వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం , పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి సాయం పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.


కన్య

కన్య : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ మాట, వ్యవహార శైలి ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికం సామాన్యం. ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకోవచ్చు.


తుల

తుల : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.


వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు, ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.


ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందుకోవడం జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.


మకరం

మకరం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మారు్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.


కుంభం

కుంభం : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.


మీనం

మీనం : మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడి ఉంటుంది. మాట విషయం, ప్రయాణంలో జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలం

Follow Us:
Download App:
  • android
  • ios