Asianet News TeluguAsianet News Telugu

06 ఫిబ్రవరి 2018 మంగళవారం..మీ రాశిఫలాలు

  • ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. 
today February 6th your horoscope

 

మేషం

మేషం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవి త భాగస్వామికి, మీరు ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్త పరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు.

వృషభం

వృషభం : ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. రావలసిన బకాయి లు వసూలవుతాయి. వివాదాల్లో, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. రుణం లేదా ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు అనుకూల ఫలితం ఉంటుంది.

మిథునం

మిథునం : ఈ రోజు మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయడానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవడా నికి అనుకూల దినం. అలాగే మిత్రుల నుంచి సాయం ఆశిస్తున్నవారికి వారు అనుకున్న సాయం అందుతుంది. మీ పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన అధికంగా ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు.

సింహం

సింహం : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మంచిది.

కన్య

కన్య : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనడం కానీ, బాగు చేయించడం కానీ చేస్తారు.

తుల

తుల : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచి, తూచి అడుగేయండి.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం, ఇతరుల సాయం తీసుకోవ డం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అలాగే మిత్రులతో అభిపాయబేధాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

మకరం

మకరం : ఈ రోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు.

కుంభం

కుంభం : ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి వి శ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

మీనం

మీనం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం, భయం కానీ ఎదురవుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం అవొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని విషయాలపై ఖర్చు చేయాల్సి వస్తుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది.
 

Follow Us:
Download App:
  • android
  • ios