ఐఏఎస్ కోసం అడ్డదారులు తొక్కిన ఐపిఎస్

Tmilnadu District tirunalveni  sp kareem copying civil services exam
Highlights

  •  సివిల్ సర్వీసెస్ పరీక్షలో మాస్ కాఫీయింగ్
  • అడ్డంగా దొరికిన తిరునల్వేని ఎస్పీ కరీం
  • హైదరాబాద్ నుంచే సమాధానాలు చేరవేత
  • అతడి బార్య, మరో వ్యక్తి అరెస్ట్

అతడు పోలీస్ శాఖలో ఉన్నతాధికారి.ఎంతో కష్టపడి ఐఎఎస్ గా ఎంపికై చక్కగా ఓ జిల్లా కు ఎస్పీగా పనిచేస్తున్నాడు. అలాంటి వాడు పరీక్షలో కాఫీయింగ్ కు పాల్పడి అడ్డంగా బుక్కయిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
వివరాల్లోకి వెళితే చెన్నైలోని తిరునల్వేని జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సపీర్ కరీం కు ఐఎఎస్ కావాలని కోరిక. ఆ కోరికను నెరవేర్చుకోడానికి అడ్డదారులు తొక్కాడు. తన బార్య సాయంతో సివిల్ సర్వీస్ ఎక్సామ్ లో మాస్ కాఫీయింగ్ కు పాల్పడుతుండగా నిర్వహకులకు అడ్డంగా దొరికిపోయాడు. హై టెక్నాలజీని ఉపయోగించి ఏకంగా ఐఎఎస్ ను సాధించాలన్న అతడి అతితెలివిని చూసి నిర్వహుకులు కూడా నివ్వెరపోయారు. 
అతడి కాఫీయింగ్ ఎలా సాగిందంటే చెన్నై లో పరీక్ష రాస్తున్న అతడు చెవి లో  అత్యంత చిన్నగా ఉండే ఇయర్ బడ్ పెట్టుకున్నాడు. దానికి బ్లూటూత్ కనెక్టయి ఉంది. దాని ద్వారా హైదరాబాద్ నుంచి తన బార్య కు ప్రశ్నలు చేరవేయడం, ఆవిడ సమాధానాలు అందించడం జరిగింది. అయితే అతడిపై అనుమానం వచ్చి పరీక్ష నిర్వహకులు తనిఖీ చేయగా చెవిలో వున్న ఇయర్ బడ్ దొరికింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు ఈ బ్లూటూత్ ఆదారంగా ట్రాక్ చేయగా హైద్రాబాద్ అశోక్ నగర్ లోని లా ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీ లొకేషన్ కు కనెక్టై అక్కడి నుంచి సమాధానాలు అందినట్లు గుర్తించారు.  వారు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించగా కరీం బార్య జాయ్స్, అకాడమీ  నిర్వాహకుడు రాంబాబు లు కలిసి ఈ కాఫీయింగ్ లో బాగస్వామ్యం వహించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
 
 

loader