బరువు తగ్గాలా.. అయితే పాలతో ఇవి తీసుకోకండి.

Three Things You Should Never Team With Milk
Highlights

  • బరువు తగ్గాలనుకునే వారు తీసుకోవాల్సిన నియమాలు
  • పాలతో ప్రోటీన్స్ కలిపి తీసుకోకూడదు

బరువు తగ్గడానికి చాలా మంది చాలా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తిండి తినడం పూర్తిగా తగ్గించేస్తారు కొందరు. మరికొందరు పండ్లు.. పాలు లాంటివి మాత్రమే తీసుకుంటారు. మీలో చాలా మంది అనుకోవచ్చు.. నేను ఎక్కువ ఆహారం తీసుకోవడంలేదు.. వాకింగ్, వ్యాయామాలు చేస్తున్నాను.. అయినా బరువు తగ్గడం లేదు అని. నిజమే మీరు ఎక్కువ ఆహారం తీసుకోకపోవచ్చు. .. కానీ ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారేమో. అంతేకాదు.. కొన్ని తిండి పదర్థాలు.. మాములుగా తక్కువ క్యాలరీలే ఉండొచ్చు.. మరేదైనా ఆహారంతో కలిసి తీసుకుంటే వాటి క్యాలరీల శాతం పెరుగుతాయి. కాబట్టి... ఏ ఆహారం వేటితో కలిపి తీసుకోకూడదు అనే విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పాలతో ఎలాంటి ఆహారాలు కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం..

 

* బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్ ఫుడ్ ని పాలతో కలిపి తీసుకోకూడదు.ముఖ్యంగా చేపలు లాంటివి తీసుకోకూడదు. ఒక వేళ కలిపి తీసుకుంటే క్యాలరీలు మరింత పెరిగుతాయి. దీంతో బరువు తగ్గకపోగా.. పెరిగే అవకాశం లేకపోలేదు.

* యాసిడ్, సిట్రస్ ఎక్కువగా ఉండే పదార్థాలు అంటే నిమ్మకాయ, నారింజ లాంటివి కూడా తీసుకోకూడదు. ఇవి పాలతో కలిపి తీసుకుంటే కడుపులోకి చేరిన తరువాత పాలు చీజ్ గా మారే అవకాశం ఉంది.

*పాలు, పండ్లు కూడా కలిపి తీసుకోకూడదు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఆయుర్వేదంలో కూడా పాలు, పండ్లను విడివిడిగా తీసుకోవాలని చెబుతున్నారు. మామిడిపండ్లు, కర్జూర లాంటివి మాత్రమే పాలతో కలిపి తీసుకోవచ్చట.

*సాధరణంగా మనలో చాలా మంది అరటి పండ్లను పాలతో కలిపి తీసుకుంటాం. అయితే.. ఈ రెండింటి కాంబినేషన్ సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఈ సలహాలు పాటిస్తూ.. డైటింగ్ చేయండి మార్పు కనపడుతుంది.

loader