మానవత్వం చూపిన  సీమ జడ్జి శ్రీనివాస్ ఆదరణ లేని వారికి అన్నం తినిపించిన జడ్జి నిర్లక్ష్యంపై కన్నెర్రజేసిన న్యాయమూర్తి నీరాజనాలు పలుకుతున్న కడప జనాలు

జడ్జి అనగానే ఎంతటి వ్యక్తికైనా భయమే. జడ్జీలకు కోపం తెప్పిస్తే జైలుకు పోవాల్సివస్తదని భయం. అందుకే జడ్జిలు అనగానే ఎవరైనా కొద్దిగా బిగుసుకుపోయి అటెన్షన్ అన్నట్లు ఉంటారు. అయితే ఎక్కువ మంది జడ్జీలు అత్యంత సౌమ్యంగానే ఉంటారు. మేము కూడా సాధారణ మనుషులమే అన్నట్లు ఉంటారు. కానీ ఈ రాయలసీమ జడ్జి ఏం చేశారో తెలుసా?

జిల్లా జడ్జిలంటే ఇలా కూడా ఉంటారా అని అందరినీ ఆశ్చర్యపరిచారు కడప జిల్లా జడ్జి శ్రీనివాస్. అనాథాశ్రమంలో దారుణాన్ని కళ్లారా చూసి చలించిపోయారు. బాధితులకు తన వంతు సాయం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఐసీడీఎస్ అధికారుల ద్వారా ఆ బాధితులకు భోజనం పెట్టి ఆకలి తీర్చారు. ఆ పండుటాకులకు ఆసరగా నిలిచారు. వారికి ఆయనే స్వయంగా భోజనం తినిపించారు.

ఆ ఆశ్రమాన్ని నడుపుతూ వారి బాగోగులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న గుడ్ హార్ట్ ఫౌండేషన్ నిర్వాహకులను కస్టడీకి ఆదేశించారు. చాలా మంది జడ్జిలకి మీడియా పిచ్చి ఉందన్న ప్రచారం ఉంది. ఈయన మీడియాకి ప్రాధాన్యత ఇవ్వలేదు. వృద్దుల దీన స్థితి చూసి చలించిపోయారు. ప్రతి జిల్లాలో ఇలాంటి జడ్జిలే ఉంటే పేదలకు, సామాన్యులకు న్యాయం జరుగుతుంది కదా? ఎంతైనా మీరు గ్రేట్ శ్రీను సార్ అంటున్నారు కడప జనాలు. మీలాంటి వారు మరింత మంది జడ్జీలు కావాలని ఆశిస్తున్నారు వారు.

ఈ వార్తను ఒక జర్నలిస్టు జులై 23న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దానికి కేలం రెండు రోజుల్లోనే 3వేల షేర్స్ వచ్చాయి. అలా ఈ జడ్జి చూపిన మానవత్వం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.