చైనా యువతకి అస్సలు ఎమీ తెలియదు. చైనాకి భారత్ కి గొడవేంటని ప్రశ్నించిన చైనీయులు.
భారత్ చైనా దేశాల మధ్య జరుతున సరిహద్దు గొడవ ఏ క్షణాన యుద్దానికి దారి తీస్తుందో అని భారతీయులు అందరు భయపడుతుంటే చైనా దేశీయులకు మాత్రం అస్సలు ఆ సమస్య ఏంటో కనీసం తెలియకుండా ఉన్నారు.
ఇండియా, చైనా, భూటాన్ మూడు ప్రాంతాలు కలిసే ప్రాంత పేరు డోక్లాం. అయితే అక్కడ చైనాకు, ఇండియాకు మధ్య ఇది వరకే చాలా సార్లు గొడవలు జరిగాయి. ఈ మధ్య మానస సరోవర యాత్ర మార్గాని చైనా మూసివేయ్యడంతో ఈ సమస్య ప్రారంభమైంది. సరిహద్దు ప్రాంతంలో చైనా సైనికులు, భారత సైనికులను తోయడంతో మరింత ఉద్రిక్తత నెలకొన్నది.
అయితే అక్కడి ప్రభుత్వ అధికారుల కన్న ప్రభుత్వ ప్రతిక అయినా గ్లోబల్ టైమ్స్ ఇండియా మీద నిందలు మోపుతూ వస్తుంది. భారతదేశం పై ఇప్పటికే పలు ఆరోపణలు చేసింది. చైనాకు దీటుగా ఇండియా కూడా అదే స్థాయిలో స్పదిస్తుంది. అయితే ఇంత జరుగుతున్న చైనా యువతకు డోక్లా సరిహద్దు లో ఏ జరుగుతుందో తెలియక పోవడం కాస్తా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చైనా సోషల్ మాద్యమం అయినా వీబొలో 40 కోట్లకు పైగా అక్కడి ప్రజలు వాడుతున్నారు. అయితే అందులో ట్రేండింగ్ ఉన్న టాప్ 50 టాఫిక్స్ లో ఇండియా, చైనా సరిహద్దు గొడవ లేదు.
