హైదరాబాద్ లోని కోఠి లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  కోఠీలోని వీ హెచ్ పి కార్యాలయం నుండి ఇవాళ  శ్రీరామ రథ యాత్ర చేపడతామని విశ్వ హిందూ పరిషత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు రథాన్ని అడ్డుకున్నారు. దీంతో భారీగా చేరుకున్న వీహెచ్ పి కార్యకర్తలు నిరసనకు దిగే అవకాశం వుందన్న అనుమానంతో పోలీసులు భారీగా కోఠికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా ముందుగానే కోఠీలోని వ్యాపార సముదాయాలను మూయించారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో కర్ప్యూ వాతావరణం ఏర్పడింది.  ఏక్షణాన ఎలాంటి సంఘటన చోటుచేసుకుంటుందో  అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

వీడియో