లక్కీ హోటల్లో మళ్లీ ఉద్రిక్తత (వీడియో)

First Published 4, Jan 2018, 5:14 PM IST
Tension again at lucky hotel
Highlights
  • లక్కీ హోటల్ యాజమాన్యం దౌర్జన్యం
  • తినడానికి వచ్చిన కస్టమర్లపై దాడి

 

ఎల్ బి నగర్ అలకపురి కాలనీలోని లక్కీ రెస్టారెంట్ లో మరో వివాదం చెలరేగింది.  రెస్టారెంట్ లో తినడానికి వచ్చిన ఇద్దరు కస్టమర్లని బిల్లు కట్టలేదంటూ సిబ్బంది దాడికి దిగారు. హోటల్ లోంచి కొట్టుకుంటూ రోడ్డుపైకి లాక్కొచ్చారు. తమ తప్పు లేకుండానే ఇలా దాడిచేసి అవమానించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్ బి నగర్ కి చెందిన 5 గురు వ్యక్తులు తినడానికని ఇవాళ మద్యాహ్నం లక్కీ రెస్టారెంట్ కు వెళ్లారు. అయితే ఇద్దరు వ్యక్తులు తిని కూర్చోగా మరో ముగ్గురు తింటుండగానే బిల్లు కట్టాలంటూ సిబ్బంది తెలిపారు. అయితే అందరూ తిన్నాక కడతామని చెప్పినా వినకుండా బిల్లు ఎగ్గొట్టడానికి  ప్రయత్నిస్తున్నారంటూ దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రెస్టారెంట్ వద్దకు చేరుకుని బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

అయితే రాత్రే స్థానిక కార్పోరేటర్ అనుచరుల దాడితో ఈ హోటల్ వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ వివాదంతో మరోసారి ఈ హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

 

ఈ దాడి వీడియోను కింద చూడండి

 

loader