తెలుగు టైటాన్స్ మొదటి మ్యాచ్ లో బోణి 5 పాయింట్ల తో తమిళ జట్టు పై విజయం సూపర్ 10 సాధించిన రాహుల్

ప్రొ క‌బ‌డ్డిలో 5వ సీజ‌న్ మొద‌లైంది. తెలుగు టైటాన్స్ త‌న మొద‌టి మ్యాచ్ లో ఘ‌న విజ‌యం సాధించింది. హైదరాబాద్ లో జ‌రిగిన మ్యాచ్ లో టైటాన్స్ జ‌ట్టు ప్రారంభం నుండి అద్బుతంగా ఆడింది. జోన్‌-బి తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌ 32-27తో తేడాతో విజ‌యం సాధించి త‌న ఖాతలో వేసుకుంది.


 టైటాన్స్‌ తరఫున రాకేశ్‌ కుమార్ మ్యాచ్ లో బోణీ చేశాడు. మూడో నిమిషంలో వినీత్‌ను అవుట్‌ చేసిన రాహుల్‌ 2-2తో స్కోరు సమం చేశాడు. కాసేపు రెండు జట్లూ ఖాళీ రైడ్స్ చేశాయి. ఐదో నిమిషంలో నీలేష్‌ బోనస్‌ పాయింట్‌ రాబట్టాడు. ప్రపంజన్‌ను విశాల్ ను రెండు సార్లు టాకీల్ చేశాడు, 17వ నిమిషంలో రాహుల్‌ ప్రత్యర్థిని ఆలౌట్‌ చేశాడు. దీంతో మొద‌టి అర్థ భాగంలో టైటాన్స్ కి 7 ప‌రుగుల అధిక్యం ల‌భించింది. 18-11తో తొలి అర్ధ భాగం ముగించిన టైటాన్స్‌ సెకండాఫ్‌లోనూ జోరు చూపించింది.

టాలీవుడ్ తార‌ల సంద‌డి.

తమిళ్‌ తలైవాస్‌ యజమానులు సచిన్‌, చిరంజీవి, తెలుగు టైటాన్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రానా, అల్లు అర్జున్‌-స్నేహ దంపతులు, అల్లు అరవింద్‌, పీవీ సింధు, గోపీచంద్‌ తదితరులు వచ్చారు. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ జాతీయ గీతం ఆలపించాడు.