జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగిది. టిడిపి పార్టీకి చెందిన ఓ మహిళా నేతను కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇంట్లోకి ప్రవేశించి మరీ కత్తిపీటతో నరికి అత్యంత దారుణంగా హతమార్చారు.

ఈ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు రామిల్ల కవిత(30)  కొత్తపల్లిలో నివాసముంటోంది. పదేళ్ల క్రితమే భర్తతో విడిపోయిన ఆమె ఇద్దరు కుమార్తెలు  శ్రీజ (15), శిరిణి(14 లను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల బందువుల వివాహానికి వెళ్లిన కవిత తన చిన్నకూతురిని అక్కడే ఉంచి పెద్ద కూతురు శ్రీజతో కలిసి ఇంటికి వచ్చింది. అయితే వీరు పడుకున్నాక ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు కవితను గొంతు నులిపి చంపడానికి ప్రయత్నించారు. తల్లి అరుపులతో లేచి వారిని అడ్డుకోడానికి ప్రయత్నించిన శ్రీజను తాడుతో కట్టేసి అరవకుండా బెదిరించారు. ఆ తర్వాత ఇంట్లోని కత్తిపీటను తీసుకుని కవితను విచక్షణారహితంగా నరికి చంపి ఆమె ఒంటిపై వున్న నగలను తీసుకుని పారిపోయారు.

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.