గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పై ఓ పోలీస్ తన జులుం ప్రదర్శించాడు. ఓ మహిళా యాక్టర్ ఇచ్చిన పిర్యాధుతో రంగంలోకి దిగిన పోలీస్ విచక్షణ లేకుండా అతడిని దుర్భాషలాడుతూ, చేయి చేసుకుని, కాలితో తంతూ నానా వీరంగం సృష్టించాడు.

 

ఈ ఘటనకు సంభందించి వివరాల్లోకి వెళితే మాదాపూర్ లో నివాసముండే యోగి షార్ట్ పిల్మ్స్ డైరెక్ట్ చేస్తుంటాడు.  ఓ షార్ట్ పిల్మ్ లో హారిక అనే యువతిని హీరోయిన్ గా పెట్టి తీశాడు. అయితే సినిమా ప్రారంభంలో ఒప్పందం చేసుకున్నట్లు రెమ్యునరేషన్ 10 వేలు ఇవ్వకుండా  తనను వేధించాడని ఆమె యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన మాదాపూర్ డిసిపి గంగిరెడ్డి యోగిని పోలీస్ స్టేషన్ కు పిలిపించాడు. అక్కడ ఆ హీరోయిన్ ముందే యోగిని దుర్భాషలాడు బూటు కాలితో తంతూ చేయిచేసుకున్నాడు. 

ఇదేనా ప్రెండ్లీ పోలీసింగ్

వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిందితులను విచారించడానికి ఓ పద్ధతి ఉంటుందని, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి ఇంత హేయంగా ప్రవర్తించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.